Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఓఏ అధ్యక్షులు నరీందర్ బత్రా ఆశాభావం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు 190మంది భారీ బృందం బయల్దేరడం ఖాయమని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షులు నరీందర్ బత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. టోక్యోకు వెళ్లే 190మందిలో ఏకంగా 100మంది అథ్లెట్లు అర్హత సాధించనున్నారని చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ధరించే అధికారిక జెర్సీ, కిట్లను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్ కటాఫ్ సమయానికి 56మంది పురుష, 44మంది మహిళా అథ్లెట్లు అర్హత సాధించనున్నారని, మరో 25నుంచి 35మందికి జులై 23నాటికి ఛాన్స్ దక్కవచ్చన్నారు. రెండు, మూడు వారాల్లో భారత్‌నుంచి 125నుంచి 135మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఒలింపిక్స్‌కు కేవలం 50రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, మిగిలిన క్రీడాంశాలు, అధికారులు, సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 190మంది టోక్యోకు బయల్దేరడం ఖాయమని బత్రా చెప్పారు. అలాగే ఈసారి ఒలింపిక్స్‌లో రెండంకె(డబుల్ డిజిట్) పతకాల్లోనూ పతకాలు సాధించడం ఖాయమన్నారు.
ప్రధాని సమీక్ష
ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్ల శిక్షణపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమీక్ష నిర్వహించారు. టోక్యో వెళ్లే వారందరికీ టీకాతోపాటు అథ్లెట్ల శిక్షణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను క్రీడా మంత్రిత్వశాఖ సమకూర్చాలని ప్రధాని కోరారు. మరో 50 రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న దృష్ట్యా మోడీ వర్చ్యువల్ సమావేశంలో పాల్గొన్నారు.