Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ నిర్వహణలో సాయపడేందుకు నమోదు చేసుకున్న 80వేల మంది వలంటీర్లలో దాదాపు 10వేల మంది వైదొలగారని జపాన్ నిర్వాహక కమిటీ బుధవారం పేర్కొంది. కరోనా మహమ్మారి ఉధృతంగా వున్న నేపథ్యంలో భారీ ఎత్తున క్రీడలు నిర్వహించడం ఎంత క్లిష్టమో దీంతో స్పష్టమైంది. వీరు వైదొలగడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి కరోనా అనడంలో ఎలాంటి సందేహం లేదని నిర్వాహక కమిటీ సిఇఓ తోషిరో ముటో విలేకర్లతో వ్యాఖ్యానించారు. అయితే ముందుగా అనుకున్న స్థాయి కన్నా తగ్గించి క్రీడలు నిర్వహించాలని భావిస్తున్నందున ఈ 10వేలమంది తగ్గడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని అన్నారు. ఇంకా మరికొంతమంది వైదొలగే అవకాశం వుందని అన్నారు. క్రీడా వేదికల వద్ద గైడ్లుగా, క్రీడా గ్రామాల వద్ద క్రీడాకారులకు సాయం చేయడంతో సహా పలు పాత్రలను ఈ వలంటీర్లు పోషిస్తారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో వుంచుకుని విదేశాల నుండి వచ్చే వీక్షకులను నిషేధించారు. 15వేల మంది వరకు అథ్లెట్లు హాజరు కానున్నారు. క్రీడలు ప్రారంభం కావడానికి ముందుగా వీరిని గాలి బుడగలో వుంచుతారు. క్రీడలు సురక్షితంగా నిర్వహించగలమన్న ధైర్యాన్ని ప్రజల్లో పాదుకొల్పేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.