Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తి సహకారానికి ఎమిరేట్స్ మంత్రి హామీ
దుబారు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు తీపి కబురు. కరోనా కారణంగా పీఎల్ 2021 ద్వితీయార్థం సీజన్‌ను యుఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. సీజన్లో మిగిలిన 31 మ్యాచుల నిర్వహణకు అక్కడ ఉన్నతాధికారులతో బీసీసీఐ ఆఫీస్ బేరర్ల బృందం సమావేశమైంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్‌లు యుఏఈ మంత్రి షేక్ నయన్ బిన్ ముబారక్ అల్ నయన్‌తో సమావేశం అయ్యారు. ఐపీఎల్ 2021 సీజన్‌ను సెప్టెంబర్ 17-19న మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
గత సీజన్ మాదిరిగానే తాజాగా కొనసాగింపు సీజన్‌కు సైతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సమావేశంలో మంత్రి హామి ఇచ్చినట్టు గల్ఫ్ పత్రిక వెల్లడించింది. దుబారు, అబుదాబి, షార్జాలు ఐపీఎల్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో కలిసి అధికారుల బృందం అబుదాబి, దుబారు, షార్జా నగరాలను పర్యవేక్షించనున్నాయి. యుఏఈ ప్రభుత్వం నుంచి ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగల్ లభించటంతో విదేశీ క్రికెటర్లను లీగ్‌కు పంపేందుకు బీసీసీఐ మంతనాలు ప్రారంభించనుంది.