Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ సిరీస్‌పై సన్నీ జోస్యం
ముంబయి : ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లి బృందం మంచి ఫలితాలు సాధిస్తుందని క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. భారత పురుష, మహిళల జట్లు జూన్ 3న లండన్‌కు చేరుకుని అక్క డ్నుంచి సౌథాంప్టన్‌కు చేరుకున్నాయి. అక్కడ మూడు రోజుల పాటు భారత జట్లు కఠిన క్వారంటైన్లో ఉండను న్నాయి. అనంతరం నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌కు అవుట్‌డోర్‌లో అడుగుపెట్ట నున్నాయి. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనున్న భారత్.. తొలుత న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పోటీపడనుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేస్తుందని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.
'ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన ఆరు వారాల తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. దీంతో టెస్టు చాంపియన్‌షిప్ ఫలితం ప్రభావం ఇంగ్లాండ్, భారత్ సిరీస్‌పై పెద్దగా కనిపించదు. ఆగస్టు-సెప్టెంబర్‌లో జరుగనున్న సిరీస్‌ను భారత్ 4-0తో గెలుచుకుంటుంది' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. 'ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో సిరీస్‌లో ఆడిన పిచ్‌లపై ఇంగ్లాండ్ గగ్గోలు పెట్టింది. భారత్‌తో సిరీస్‌కు గ్రౌండ్స్‌మన్ పిచ్‌పై పచ్చిక ఉంచితే అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. పచ్చిక పిచ్ భారత్‌కు ఇక ఎంతమాత్రం ప్రమాదకరం కాదు. ఆ పిచ్‌లపై మన బౌలర్లు ఎంతో వృద్ది చెందారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతారని' సన్నీ అన్నాడు.