Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడమకాలి పాదం గాయం ప్రభావం
మొనాకో : స్విట్జర్లాండ్ స్టార్ ఆటగాడు, మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి దూరం కానున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఖతార్ ఓపెన్ తొలి రౌండ్లో లాయిడ్ హారీస్ చేతిలో పరాజయం పాలైన స్టానిస్లాస్ వావ్రింకా.. అప్పటి నుంచి ఏటీపీ టూర్ మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించటం లేదు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ జూన్ 28 నుంచి ఆరంభం కానుంది. వింబుల్డన్‌లో 15సార్లు పోటీపడిన వావ్రింకా 2014, 2015లో క్వార్టర్ఫైనల్లో ప్రవేశించాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన వావ్రింకా.. 2015లో ఫ్రెంచ్ ఓపెన్, 2016లో యు.ఎస్ ఓపెన్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వావ్రింకా ఎడమ కాలి పాదానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం మొనాకోలో వావ్రింకా రిహాబిలిటేషన్‌లో కొనసాగుతున్నాడు. గ్రాస్‌కోర్టు సీజన్‌కు అందుబాటులో ఉండాడని భావించినా.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ మేరకు ఏటీపీ ఓ ప్రకటనలో తెలిపింది.