Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీకి బీసీసీఐ సూత్రప్రాయ నిర్ణయం
దుబారు : 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోయింది!. హైదరాబాద్ సహా భారత్‌లోని తొమ్మిది నగరాల్లో టీ20 ప్రపంచకప్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టోర్నీ ప్రణాళిక పంపిన స్వల్ప కాలంలోనే.. మెగా ఈవెంట్ విదేశీ గడ్డకు వెళ్లిపోయింది. ప్రస్తుతానికి ఇది అనధికారిక నిర్ణయమే అయినా.. ఐసీసీ, బీసీసీఐలు ఈ విషయంలో ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపంలో దేశీయంగా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ను 29 మ్యాచుల అనంతరం అర్థాంతరంగా ఆపివేసింది. ఈ లీగ్ సెప్టెంబర్ మూడో వారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వేదికగా నిర్వహించనున్నారు. టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కలిగిన బీసీసీఐ.. ఐసీసీ పొట్టి కప్పును యుఏఈలోనే నిర్వహిస్తామని ఐసీసీకి సూత్రప్రాయంగా చెప్పినట్టు సమాచారం. ఇటీవల ముగిసిన ఐసీసీ బోర్డు సమావేశంలో.. టీ20 ప్రపంచకప్ వేదిక నిర్ణయానికి నాలుగు వారాల గడువు కావాలని బోర్డు కోరింది.
'అవును, ఐసీసీ బోర్డు సమావేశంలో అధికారికంగా నాలుగు వారాల సమయం కోరింది బీసీసీఐ. ఐసీసీ అంతర్గతంగా యుఏఈలోనే టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తామని ఐసీసీకి తెలిపింది. ఆతిథ్య హక్కులు అట్టిపెట్టుకుంటామని చెబుతూనే, యుఏఈ లేదా ఓమన్‌లో వరల్డ్‌కప్ నిర్వహణకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. అక్టోబర్ 10 నాటికి ఐపీఎల్ 2021 ముగియనుంది. టీ20 ప్రపంచకప్ నవంబర్‌లో ఆరంభం కానుంది. దీంతో పిచ్‌లకు మూడు వారాల విరామం లభించనుంది. టీ20 ప్రపంచకప్ తొలివారం (క్వాలిఫయర్స్) మ్యాచులు ఓమన్‌లో జరుగుతాయి. దీంతో యుఏఈ పిచ్ నాణ్యత, ఫిట్‌నెస్‌పై ఎటువంటి సందేహాలు అవసరం లేదు' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.