Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నం.
- సిట్సిపాస్, సిన్నర్, స్టిఫెన్స్ ముందంజ
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
ప్రపంచ నం.1, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ వరుసగా 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి మూడు రౌండ్లలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోని 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల మొనగాడు.. మట్టికోర్టులో దూకుడు చూపిస్తున్నాడు. కెరీర్ 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు.
మట్టికోర్టులో నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడు రౌండ్లలో వరుస సెట్లలో జకోవిచ్ ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా అలవోక విజయాలు నమోదు చేశాడు. లూథియాన ఆటగాడు రికార్డాస్ బెరాన్కిస్పై 6-1, 6-4, 6-1తో జకోవిచ్ విజయం సాధించాడు. బెరాన్కిస్తో గతంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ జకోవిచ్
వరుస సెట్లలోనే గెలుపొం దాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏకంగా ఆరుసార్లు బ్రేక్ చేసిన జకోవిచ్ తన సత్తా చూపించాడు. మూడో రౌండ్ పోరులో జకోవిచ్ ఒక్క బ్రేక్ పాయిం ట్ను కూడా ప్రత్యర్థికి కోల్పోలేదు. 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జకోవిచ్ 18 అనవసర తప్పిదాలకు పాల్పడినా.. అలవోకగా ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. తర్వాతి మ్యాచ్‌లో సైతం జకోవిచ్‌కు సులువైన ప్రత్యర్థి ఎదురు కానున్నాడు. కుర్ర ఆటగాడు లారెంజో ముసెటితో జకోవిచ్ ప్రీ క్వార్టర్స్‌లో పోటీపడ నున్నాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో సహచర ఇటలీ ఆటగాడు మార్కోపై 3-6, 6-4, 6-3, 6-3తో లారెంజో మెరుపు విజయం సాధించాడు. 18వ సీడ్ జానిక్ సిన్నర్ వరుస సెట్ల విజయంతో నాల్గో రౌండ్లో అడుగుపెట్టాడు. 6-1, 7-5, 6-3తో మైకల్ యమెర్పై సిన్నర్ సులువైన విజయం సాధించాడు. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించిన సిన్నర్.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఐదో సీడ్, గ్రీసు సంచలనం స్టెఫానోస్ సిట్సిపాస్ మూడో రౌండ్లో గట్టెక్కాడు. అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్‌పై సిట్సిపాస్ నాలుగు సెట్ల పోరులో పైచేయి సాధించాడు. 5-7తో తొలి సెట్‌ను కోల్పోయిన సిట్సిపాస్.. 6-3, 7-6(7-3), 6-1తో వరుస సెట్లలో ఇస్నర్‌ను ఓడించాడు. 8 ఏస్‌లు కొట్టిన సిట్సిపాస్.. ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడ్డాడు. మూడు బ్రేక్ పాయింట్లు సాధించిన సిట్సిపాస్..తన సర్వీస్‌ను 20 సార్లు నిలుపుకున్నాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. పాయింట్ల పరంగా 125-105తో తిరుగులేని పైచేయి సాధించాడు. కార్లోస్ గార్ఫియ 6-4, 7-6(7-3), 6-2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌పై వరుస సెట్లలో గెలుపొంది నాల్గో రౌండ్‌కు చేరుకోగా...అర్జెంటీనా ఆటగాడు డీగో స్వార్ట్‌జ్‌మన్ 6-4, 6-2, 6-1తో ఫిలిప్ (జర్మనీ) వరుస సెట్లలో అదిరే విజయం సాధించాడు.
స్టీఫెన్స్ జోరు
యు.ఎస్ ఓపెన్ మాజీ చాంపియన్, మాజీ ప్రపంచ నం.3 స్లోనె స్టీఫెన్స్ ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో 18వ సీడ్ అమ్మాయి కరొలినా ముచోవాపై 6-3, 7-5తో స్టీఫెన్స్ విజయం సాధించింది. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన స్టీఫెన్స్.. నాలుగు సార్లు ముచోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి దెబ్బకొట్టింది. పాయింట్ల పరంగా 82-68తో సాధికారిక ఆధిపత్యం చెలాయించింది. అమెరికన్ల పోరులో సోఫియా కెనిన్ 4-6, 6-1, 6-4తో జెస్సికా పెగులాపై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకుంది. పది డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన సోఫియా.. ఏడు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టింది. చెక్ భామ బార్బరా క్రజికోవా 6-3, 6-2తో ఎలినా స్విట్లోనాపై గెలుపొందింది.