Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజయ్ మంజ్రేకర్ ఘాటు విశ్లేషణ
ముంబయి : వివాదాస్పద వ్యాఖ్యానంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొనే మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడనే చెప్పాలి. టీమ్ ఇండియా ట్రంప్‌కార్డ్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆల్ టైమ్ గ్రేట్‌గా పరిగణించకూడదని సంజరు మంజ్రేకర్ అన్నాడు. ' రవిచంద్రన్ అశ్విన్‌ను ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా ప్రజలు చర్చ చేసినప్పుడు నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అందులో తొలి అభ్యంతరం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డపై అశ్విన్ గణాంకాలు. ఈ దేశాల్లో అశ్విన్‌కు కనీసం ఒక్క ఐదు వికెట్ల ప్రదర్శన లేదు. గత నాలుగేండ్లుగా తన బౌలింగ్ శైలికి సరిపోలే భారత పిచ్‌లపైనే అతడు రాణిస్తున్నాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా అశ్విన్‌కు సమవుజ్జీగా వికెట్ల వేట సాగించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అశ్విన్ కంటే అధికంగా అరంగేట్ర అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు పడగొట్టాడు' అని మంజ్రేకర్ అన్నాడు. 79 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 24.69 సగటుతో 409 వికెట్లు కూల్చాడు. అందులో ఓ ఇన్నింగ్స్‌లో 30 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఏడుసార్లు టెస్టులో పది వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత తరఫున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లలో అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్‌లు అశ్విన్ కంటే ముందంజలో ఉన్నారు. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.