Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతి వివక్ష ట్వీట్లపై ఈసీబీ చర్య
లండన్ : ఎనమిదేండ్ల క్రితం చేసిన జాతి వివక్ష, లైంగిక సోషల్ మీడియా ట్వీట్లకు ఇంగ్లాండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో క్రికెట్లో జాతి వివక్షకు రూపమాపేందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్మాణాత్మక చర్యలు చేపడుతోంది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన ఒలీ రాబిన్సన్ 2012-13లో చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఒలీ రాబిన్సన్ ట్వీట్లపై ఈసీబీ ఇప్పటికే విచారణకు ఆదేశింది. అదే సయమంలో ఒలీ రాబిన్సన్ను అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ సహా కౌంటీ చాంపియన్షిప్ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అనుభవలేమి, అవగాహన రాహిత్యంతో చేసిన ట్వీట్ల తీవ్ర పశ్చాత్తాపం చెందుతున్నానని ఒలీ రాబిన్సన్ బహిరంగ క్షమాపణలు చెప్పినా.. ఈసీబీ వేటు వేయటం గమనార్హం. ఒలీ రాబిన్సన్ న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టి రాణించాడు. ఒలీ రాబిన్సన్ తన ట్వీట్లపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పినా.. నిషేధం విధించటం సరైనది కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అభిప్రాయపడ్డాడు.