Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, శ్రీలంక సిరీస్ షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : భారత ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంక పర్యటన జులై 13 నుంచి ఆరంభం కానుంది. విరాట్ కోహ్లిసేన 104 రోజుల ఇంగ్లాండ్ పర్యటన నిమిత్తం ఇప్పటికే అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో క్వారంటైన్ సహా ఇతర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ.. ఏక కాలంలో రెండు జాతీయ జట్లను బరిలోకి దింపుతోంది. ఓ జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు ఫార్మాట్లో పోటీపడనుండగా.. మరో జట్టు వైట్ బాల్‌తో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటనుంది. భారత్, శ్రీలంక సిరీస్ షెడ్యూల్‌ను ప్రసారదారు సోనీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ' భారత గాలులు శ్రీలంక తీరాన్ని తాకనున్నాయి' అంటూ సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 13న తొలి వన్డే జరుగనుండగా.. 16, 18న చివరి రెండు వన్డేలు జరుగనున్నాయి. జులై 21, 23, 25న టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్ విడుదల చేసినా.. వేదికలను ఖరారు చేయాల్సి ఉంది.
శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్ జట్టును సైతం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సహా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ సైతం కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.