Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లో అడుగు
- ఉత్కంఠ పోరులో పవ్లీచెంకోవా గెలుపు
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
పారిస్ (ఫ్రాన్స్)
మహిళల సింగిల్స్‌లో స్లోవే నియా అమ్మాయి చరిత్ర సృష్టిం చింది. ప్రపంచ నం.85 ర్యాంకర్, గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఎన్నడూ రెండో రౌండ్ దాటని తమెర జిడాన్సెక్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైన ల్లోకి ప్రవేశించింది. ప్రొఫెషనల్ కెరీర్లో అతిపెద్ద మ్యాచ్‌లో ఆడేం దుకు రంగం సిద్ధం చేసుకుంది. తొలిసారి క్వార్టర్ ఫైనల్లో ఆడుతున్న స్పెయిన్ క్రీడాకారిణి పౌలా బడొసాపై మూడు సెట్ల సమరంలో జిడాన్సెక్ అద్భుత విజయం సాధించింది. 7-5, 4-6, 8-6తో రెండున్నర గంటల మ్యాచ్‌ను జిడాన్సెక్ సొంతం చేసుకుంది. సెర్బియా ఓపెన్ విజేత, బడోసా క్వార్టర్ఫైనల్లో దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే జిడాన్సెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన బడోసా 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 23 ఏండ్ల జిడాన్సెక్ వేగంగా పుంజు కుంది. ఆకట్టుకునే ప్రదర్శనతో వరుస పాయింట్లు సాధించిన జిడాన్సెక్ 5-4తో సెట్లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాతి గేమ్‌ను నెగ్గిన బడోసా 5-5తో స్కోరు సమం చేసింది. కండ్లుచెదిరే డ్రాప్ షాట్‌తో 6-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జిడాన్సెక్.. 53 నిమిషాల తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలో ఇబ్బందిపడిన బడోసా.. జిడాన్సెక్కు 1-3తో ఆధిక్యం కోల్పోయింది. తొలి సెట్ తరహాలోనే రెండో సెట్లోనూ వేగంగా సమీకరణాలు మారి పోయాయి. జిడాన్సెక్ సర్వీస్‌ను వరుసగా మూడుసార్లు బ్రేక్ చేసిన బడోసా.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక మూడో సెట్లో బడోసా 2-0తో ఆరంభ ఆధిక్యం సాధించగా.. జిడాన్సెక్ 2-2తో స్కోరు సమం చేసింది. మూడో సెట్లో రెండుసార్లు మ్యాచ్ పాయిం ట్ను కాచుకున్న జిడాన ్సెక్.. బడోసా ఒత్తిడిలో చేసిన పొరపాట్లను సొమ్ము చేసుకుంది. కెరీర్ తొలి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్లోకి ప్రవేశిం చింది. 8 బ్రేక్ పాయింట్లు సాధించిన జిడాన్సెక్.. 48 విన్నర్లు సాధించింది. జిడాన్సెక్ 39 అనవసర తప్పిదాలు చేయగా.. బడోసా 47 అనవసర తప్పిదాలు చేసింది. పాయింట్ల పరంగా 114-111తో బడోసాపై జిడాన ్సెక్ పైచేయి సాధించింది.
మహిళల సింగిల్స్‌లో ఉత్కంఠ రేపిన మరో క్వార్టర్ఫైనల్లో రష్యా క్రీడాకారిణి అనస్థాసియ పవ్లీ చెంకోవా విజయం సాధించింది. కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినా నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న మూడు సెట్ల పోరును 6-7(2-7), 6-2, 9-7తో కజకిస్థాన్ ప్లేయర్‌ను ఓడించింది. ఐదు ఏస్‌లు కొట్టిన పవ్లీచెంకోవా.. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించింది. టైబ్రేకర్‌కు దారితీసిన తొలి సెట్‌ను కోల్పోయిన పవ్లీచెంకోవా.. తర్వాతి సెట్‌ను 6-2తో సాధికారికంగా సొంతం చేసుకుంది. రెండు గంటల 33 నిమిషాల క్వార్టర్‌ఫైనల్ సమరంలో నిర్ణయాత్మక మూడో సెట్‌ను సూపర్ టైబ్రేకర్‌లో పవ్లీచెంకోవా గెలుచుకుంది.
ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో మార్టా కోస్టుక్పై ఎనిమిదో సీడ్, టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్ అలవోక విజయం సాధిం చింది. 6-3, 6-4తో స్వైటెక్ వరుస సెట్లలో గెలుపొందింది. నాలుగు బ్రేక్ పాయిం ట్లు సాధించిన స్వైటెక్.. పాయింట్ల పరంగా 77-63తో పైచేయి సాధించింది.