Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని జాతి వివక్ష ట్వీట్ల దుమారం
లండన్ : ఏడు వికెట్ల ప్రదర్శనతో లార్డ్స్ టెస్టులో అరంగేట్రం చేసిన ఆనందం కోల్పోయిన ఒలీ రాబిన్సన్.. ఎనిమిదేండ్ల క్రితం సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో చేసిన జాతి వివక్ష పూరిత ట్వీట్లకు మూల్యం చెల్లించు కున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రాబిన్సన్పై వేటు వేసిన సంగతి తెలిసిందే. గతంలో వివక్ష పూరిత ట్వీట్లు చేసిన జాబితాలో మరికొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ఇరుకున్నారు. వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోశ్ బట్లర్ సహా దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్‌లు సైతం ఈ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో స్టువర్ట్ బ్రాడ్ హెయిర్ స్టయిల్‌ను ఉద్దేశిస్తూ.. ' 15 ఇయర్స్ ఓల్డ్ లెస్బియన్' అని అండర్సన్ ట్వీట్ చేశాడు. తాజాగా ఈ ట్వీట్‌ను అండర్సన్ తొలగించాడు. భారత అభిమానులను ఉద్దేశిస్తూ ఇయాన్ మోర్గాన్, జోశ్ బట్లర్‌ల వ్యంగ్య సందేశాల స్క్రీన్షాట్లు చక్కర్లు కొడుతున్నాయి. మోర్గాన్, బట్లర్లపైనా ఈసీబీ విచారణకు ఆదేశించింది. అన్ని రకాల వివక్షలకు అతీతంగా ఆటను తీర్చిదిద్దేందుకు ఈసీబీ నిర్మాణాత్మక చర్యలు తీసుకునేందుకు అడుగు ముందుకేస్తోంది.