Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత మాజీ బాక్సర్ డింకో సింగ్(42) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గురువారం ఉదయం కన్నుమూశాడు. డింకో ఇంఫాల్‌లో మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. డింకోకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత ఏడాది కరోనా సోకిన డింకో.. 2017నుంచి క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాడు. మూడు నెలలు క్రితం డింకో ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. బ్యాంకాక్ వేదికగా 1997లో జరిగిన కింగ్స్ కప్‌తో డింకో తొలిసారి వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రెండోరౌండ్లో ఓటమితో 1998 ఆసియా క్రీడల్లో ఆడే ఛాన్స్ కోల్పోయాడు. కానీ చివరి నిమిషంలో బాక్సింగ్ జట్టులో చోటు దక్కించుకొని స్వర్ణ పతకం సంపాదించిపెట్టాడు. సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, స్థానిక ఆటగాడు వాంగ్ ప్రెజెస్పై హోరాహోరా పోరులో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ టిమర్ టుల్యకోవ్(ఉబ్జెకిస్తాన్)ను చిత్తుచేసి 16ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని సంపాదించిపెట్టాడు. పోటీలు ముగిసిన అనంతరం ఇంఫాల్‌కు తిరిగి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. మణిపూర్ ప్రభుత్వం ఓ రహదారికి డింకో పేరు పెట్టడం విశేషం. 1998లో అర్జున, 2013లో పద్మశ్రీ అవార్డులు డింకో సింగ్‌కు లభించాయి.