Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: ఒలింపిక్స్ జరిగే టోక్యో గ్రామంలో మద్యపాన నిషేధం చేయడం కష్టమేనని ఆర్గనైజింగ్ కమిటీ సిఇవో తోషిరో మూటో అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే మద్యాన్ని నియంత్రించగలమని, అథ్లెట్ల గదుల్లో ఇది కష్టంతో కూడుకున్నదని చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్ జరిగే సమయంలో యువ అథ్లెట్లు, అధికారులు, సభ్యులు పార్టీలు చేసుకోవడం సహజమేనన్నారు. 11వేలమంది ఒలింపిక్ అథ్లెట్లు, 4,400మంది పారా ఒలింపియన్లు ఉండే గ్రామంలో మద్యం నియంత్రించబడుతుందా? అనేది స్పష్టంగా చెప్పలేమన్నారు. మద్య నిషేధ పాలసీపై జపాన్ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఈ నెలాఖరులోగా టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్వాహకులు తీసుకొనే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒలింపిక్ అర్హత టోర్నీకి ఆస్ట్రేలియా బేస్‌బాల్ జట్టు దూరం
తైవాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ అర్హత బేస్‌బాల్ టోర్నమెంట్‌నుంచి వైదొలుగుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. జూన్ 22-26మధ్య జరిగే టోర్నీనుంచి కరోనా వైరస్ కారణంగా రాలేమని బేస్‌బాల్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్లెన్ విలియమ్సన్ తాజాగా ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇదే చివరి అవకాశమని, కానీ అథ్లెట్ల శ్రేయస్సు, ప్రయాణ ఆంక్షల దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ 4వ ర్యాంక్ జట్టు తైవాన్ గత వారం మెక్సికో వేదికగా జరగాల్సిన టోర్నమెంట్‌నుంచి వైదొలగడంతో తైవాన్ వేదికగా జరిగే బేస్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీకి చైనా దూరమైంది. దీంతో డోమినికన్ రిపబ్లిక్, నెదర్లాండ్, వెనిజులాతో పాటు ఆరు దేశాలు మాత్రమే అర్హత టోర్నమెంట్లో పాల్గోనున్నాయి