Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి రష్యా సంచలనం, 31వ సీడ్ అనస్తేషియ పావ్యుచెంకోవా ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ పోటీలో పావ్యుచెంకోవా 7-5, 6-3 తేడాతో అన్‌సీడెడ్ తమరా జిదాన్సేక్(స్లోవేనియా)ను చిత్తుచేసింది. తొలి సెట్ హోరాహోరీ పోరులో 7-5తో గెల్చుకున్న పావ్యుచెంకోవా.. రెండో సెట్లో ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశమి వ్వకుండా 6-3తో ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో రష్యా భామ మరియ షరపోవా తర్వాత ఫ్రెంచ్ ఫైనల్‌కు చేరిన మరో క్రీడాకారిణి పావ్యుచెంకోవానే. షరపోవా 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లను గెల్చింది. క్రేజికేవా/సక్కారి మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో టైటిల్‌కై పావ్యుచెంకోవా శనివారం తలపడనుంది.
నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ పోటీలు శుక్రవారం జరగనున్నాయి. బుధవారం రాత్రి జరిగిన నాల్గో క్వార్టర్‌ఫైనల్ పోటీలో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్(సెర్బియా) 6-3, 6-2, 6-7(5-7), 7-5తో 9వ సీడ్ బెర్రెట్టిని(ఇటలీ)ని చిత్తుచేసి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే తొలి సింగిల్స్ సెమీఫైనల్స్ పోటీల్లో 6వ సీడ్ జ్వెరేవ్(జర్మనీ), 5వ సీడ్ సిట్సిపాస్(గ్రీక్)తో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్(సెర్బియా), 3వ సీడ్ రఫెల్ నాదల్(స్పెయిన్)తో తలపడ నున్నాడు. అంతకుముందు సిట్సిపాస్ 2వ సీడ్ రష్యాకు చెందిన మెద్వదెవ్‌ను ఓడించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.