Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్మింగ్‌హామ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తడబడింది. గురువారం టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు సిబ్లే-బర్న్స్ 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశారు. సిబ్లే(35)ను పెవీలియన్‌కు పంపి హెన్రీ ఈ జోడీని విడదీశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బర్న్స్(81) అర్ధసెంచరీతో రాణించగా.. క్రాలే(0), రూట్(4) వికెట్ కీపర్ బ్రేస్(0) నిరాశపరిచారు. అనంతరం న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు కడపటి వార్తలందే సమయానికి 61 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. బౌల్ట్, హెన్రీకి రెండేసి, వాగర్, అజాజ్ పటేల్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.