Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ది హండ్రెడ్ లీగ్‌పై అరుణ్ కుమార్
న్యూఢిల్లీ : ' ది హండ్రెడ్' లీగ్ అనుభవం భారత మహిళా క్రికెటర్లకు గొప్పగా ఉపయోగపడనుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ప్రపంచకప్ వేటలో భారత అమ్మాయిలకు ది హండ్రెడ్ అనుభవం కీలకం కానుందని ధుమాల్ అన్నాడు. ఎనిమిది మెన్స్, ఎనిమిది ఉమెన్స్ జట్ల ఫ్రాంచైజీలతో జులై 21న ది హండ్రెడ్ లీగ్ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ లీగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ది హండ్రెడ్ లీగ్‌లో భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన సహా యువ సంచలనం షెఫాలీ వర్మలు ఆడుతున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధానలు గతంలో ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్‌బాష్ లీగ్‌లోనూ ప్రాతినిథ్యం వహించారు. ' ఇంగ్లాండ్ పరిస్థితుల్లో రాటుదేలేందుకు ది హండ్రెడ్‌లో ఆడనున్నారు. పురుష క్రికెటర్లు కౌంటీ క్రికెట్లో ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులపై అనుభవం గడించారు. అమ్మాయిలు ది హండ్రెడ్ ద్వారా అనుభవం గడించనున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఈ అనుభవం కలిసిరానుంది' అని అరుణ్ కుమార్ ధుమాల్ తెలిపాడు.