Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్ అంతర్గత వార్మప్ మ్యాచ్
సౌథాంప్టన్ : యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ (112 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఆస్ట్రేలియాలో కంగారూ జట్టుపై అసమాన ఇన్నింగ్స్‌లతో చెలరేగిన రిషబ్ పంత్.. ఇంగ్లాండ్ పరిస్థితుల్లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జూన్ 18న న్యూజిలాండ్‌తో తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత జట్టు అంతర్గత వార్మప్ మ్యాచ్‌లతో సిద్ధమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ వేదిక సౌథాంప్టన్‌లోనే విరాట్ కోహ్లి సేన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. రెండో రోజు ఆట అనంతరం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన వివరాలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రిషబ్ పంత్ 94 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. డ్యూక్ బంతులను అలవోకగా స్టాండ్స్‌లోకి పంపించిన రిషబ్ పంత్ సౌథాంప్టన్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ సైతం బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 135 బంతుల్లో 85 పరుగులతో రాణించాడు. వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్లు మాత్రమే చెప్పుకోదిగన పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (3/36) మూడు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.
జూన్ 3న లండన్‌కు చేరుకుని అక్కడ్నుంచి సౌథాంప్టన్‌కు వెళ్లిన భారత జట్టు అక్కడే మూడు రోజుల కఠిన క్వారంటైన్లో గడిపింది. కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ నివేదికల అనంతరం ఐసోలేషన్‌లో అవుట్డోర్ ప్రాక్టీస్‌కు చేస్తున్నారు. విరాట్ కోహ్లిసేన పాటు మిథాలీరాజ్ సేన సైతం సౌథాంప్టన్‌లోనే సాధన చేస్తోంది. కోహ్లిమెన్ అంతర్గత మ్యాచులతో రాటుదేలుతుండగా... మిథాలీ గ్యాంగ్ నెట్ సెషన్లలో చెమటోడ్చుతున్నారు.