Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య
న్యూఢిల్లీ : భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2017 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మీరాబాయి చాను 49 కేజీల మహిళల క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన మీరాబాయి ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా రెండోసారి ప్రాతినిథ్యం వహించబోతుంది. ఈ మేరకు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) శనివారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరం కావటంతో.. 49 కేజీల విభాగంలో నాలుగో స్థానంలో ఉన్న మీరాబాయి చాను రెండో స్థానానికి ఎగబాకింది. నిబంధనల ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. పురుషుల విభాగంలో 14 కేటగిరీలు, మహిళల విభాగంలో ఏడు కేటగిరీల్లో ఒలింపిక్ పోటీలు నిర్వహించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌కు కఠోరంగా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.