Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ముందు అగ్రస్థానం
దుబారు : జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రపంచ నం.1 టెస్టు జట్టుగా బరిలోకి దిగనుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో అత్యధిక విజయ శాతంతో భారత జట్టు అగ్రస్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. 123 రేటింగ్ పాయింట్లతో నం.1 ర్యాంక్ కైవసం చేసుకోగా.. భారత జట్టు 121 రేటింగ్ పాయింట్లతో నం.2 స్థానానికి పడిపోయింది. 2014 తర్వాత ఇంగ్లాండ్ సొంతగడ్డపై ఎన్నడూ టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు. 1999 నుంచి న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో సాధించలేకపోయింది.ఈ రెండు ఘనతలను న్యూజిలాండ్ ఒక్క టెస్టు విజయంతో సాధించేసింది.