Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌పై 8 వికెట్లతో గెలుపు
- 1-0తో టెస్టు సిరీస్ కైవసం
బర్మింగ్‌హామ్ : టీమ్ బ్లాక్‌క్యాప్స్ బంపర్‌హిట్ కొట్టింది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించింది. జో రూట్ సారథ్యంలో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓటమెరుగని ఇంగ్లీష్ జట్టుకు.. పరాజయాన్ని అందించింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. మూడు రంగాల్లోనూ ఎదురులేని ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ (3/78), (3/36) నిప్పులు చెరిగే ప్రదర్శనతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేశాడు. రోరీ బర్న్స్ (81), డామ్ సిబ్లే (35) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 303 పరుగులు చేసింది. ఓపెనర్ డెవన్ కాన్వే (80, 143 బంతుల్లో 12 ఫోర్లు), విల్ యంగ్ (82, 204 బంతుల్లో 11 ఫోర్లు), టామ్ బ్లండెల్ (34, 77 బంతుల్లో 5 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (21, 56 బంతుల్లో 1 ఫోర్) మెరవటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగుల భారీ స్కోరు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 122/9తో నిలిచిన ఇంగ్లాండ్.. నాల్గో రోజు ఉదయం సెషన్ తొలి బంతికే చివరి వికెట్‌ను కోల్పోయింది. 38 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధిం చింది. పేసర్ మాట్ హెన్రీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఇంగ్లాండ్ తర ఫున రోరీ బర్న్స్, న్యూజిలాండ్ తరఫున డెవన్ కాన్వేలు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లుగా నిలిచారు.