Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ పరిస్థితులపై రహానె టిప్స్
బ్రిస్టోల్ (ఇంగ్లాండ్) : భారత అమ్మాయిల జట్టు ఏడేండ్ల విరామం అనంతరం తొలిసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 2014లో ఇంగ్లాండ్‌పై బెంగళూర్ టెస్టులో గెలుపొందిన తర్వాత, అమ్మాయిల జట్టు మళ్లీ టెస్టు క్రికెట్ ఆడలేదు. ఇంగ్లాండ్, భారత్ ఏకైక టెస్టు బుధవారం నుంచి బ్రిస్టోల్‌లో ఆరంభం కానుంది. టెస్టు మ్యాచ్ అనంతరం వన్డే, టీ20 సిరీస్ సైతం జరుగనుంది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడింది. ' నేను పెద్దగా టెస్టులు ఆడలేదు. కేవలం రెండు టెస్టుల అనుభవమే ఉంది. ఈ సారి టెస్టు నిపుణుడు అజింక్య రహానెతో మాట్లాడే అవకాశం చిక్కింది. రెడ్ బాల్ క్రికెట్లో బ్యాటింగ్ చేయాల్సిన తీరు, ఇంగ్లాండ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ వ్యూహంపై రహానెతో మాట్లాడాం. అతడి సలహాలు జట్టుకు మేలు చేయనున్నాయి. నెట్ సెషన్లలోనూ సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేసేందుకు కఠోరంగా శ్రమించాం. సంతోషంగా ఉన్నప్పుడు మంచి క్రికెట్ ఆడగలం, శక్తిమేరకు ఆడే అవకాశం ఉంటుంది. ఇక్కడి పరిస్థితుల్లో అనుభవం కలిగిన రహానె సహా విరాట్ కోహ్లిలతో అమ్మాయిలు మాట్లాడారు. నెట్ సెషన్లలోనే ఆ చర్చ ఫలితం ప్రతిబింబించింది' అని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.