Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్లూటీసీ ప్రైజ్‌మనీపై ఐసీసీ
దుబారు : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి విజేతగా నిలువబోయే జట్టు 1.6 మిలియన్ డాలర్లు (రూ.12 కోట్లు) అందుకోనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా..భారత్, న్యూజిలాండ్‌లు పోటీపడనున్నాయి. ' ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విన్నర్స్ గదతో పాటు 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందుకోనుంది' అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది. తొలి టెస్టు చాంపియన్‌షిప్ విజేత సుమారు రూ.12 కోట్లు దక్కించుకోనుండగా... రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్లు లభించనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా, టైగా ముగిస్తే.. రూ.18 కోట్ల నగదు బహుమతిని ఇరు జట్లు సమానంగా పంచుకోనున్నాయి. సంయుక్త విజేతలుగా టెస్టు చాంపియన్‌షిప్ గదను చెరో ఏడాది అట్టిపెట్టుకోనున్నాయి. ఈ మేరకు ఐసీసీ ప్రకటనలో తెలిపింది. ఐసీసీ డబ్ల్యూటీసీ సీజన్లో మూడో స్థానంలో నిలిచిన జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టు సహా డబ్లూటీసీ రేసులో నిలిచిన తొమ్మిది జట్లు సైతం ఐసీసీ నుంచి ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.