Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టు అంతర్గత ప్రణాళికలో అతడి బ్యాటింగ్ భాగం
- మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్
ముంబయి : డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ అడుగు పెట్టేందుకు చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ విభాగంలో కీలకంగా నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా ప్రదర్శనే భారత విజయంలో కీలకమైంది. జట్టు అంతర్గత ప్రణాళికల్లో భాగంగానే పుజారా ప్రతిసారీ సంతృప్తిపరిచినా.. పుజారా బ్యాటింగ్‌పై విమర్శకులు తరచుగా విమర్శలు చేస్తున్నారు. పుజారా విమర్శకులకు సచిన్ టెండూల్కర్ మాస్టర్ పంచ్ ఇచ్చాడు. 'భారత్‌కు పుజారా చేసిన దానికి అతడిని ప్రశంసించాలి. టెస్టుల్లో ప్రతిసారీ స్ట్రయిక్‌రేట్ ముఖ్యం కాదు. జట్టు ప్రణాళికలకు విభిన్నమైన ఆటతీరు, విభిన్నమైన ఆటగాళ్లు అవసరం. చేతికి ఉన్న ఐదు వేళ్లు ఒకేలా ఉండవు. జట్టులోనూ ఆటగాళ్ల పాత్ర అలాగే ఉంటుంది. పుజారా ఇన్నింగ్స్‌ను శుల్యశోధన చేసే బదులు అతడి ప్రదర్శనను ప్రశంసించాలి. పుజారాను విమర్శిస్తున్న వారు.. అతడు భారత్‌కు చేసిన దాంట్లో సగమైనా చేయలేదు' అని సచిన్ టెండూల్కర్ అన్నాడు. భారత్, న్యూజిలాండ్ డబ్లూటీసీ ఫైనల్స్‌కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ జరగకుండా ఉండే బాగుండేదని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. రెండేండ్లలో డబ్ల్యూటీసీ ఫైనల్ కాకుండా.. నాలుగేండ్లకు ఓసారి రెండు నెలల సమయంలో రెండు దేశాల్లో టెస్టు చాంపియన్‌షిప్ (టెస్టు ప్రపంచకప్)ను నిర్వహిస్తే బాగుంటుందని సచిన్ టెండూల్కర్ సూచించాడు.