Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో భారత్ ఏకైక టెస్టు నేటి నుంచి మ.3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
బ్రిస్టోల్ (ఇంగ్లాండ్) : భారత మహిళల క్రికెట్ జట్టు సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు ఫార్మాట్లోకి అడుగు పెడుతోంది. 2401 రోజుల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో బ్రిస్టోల్‌లో ఏకైక టెస్టుకు రంగం సిద్ధం చేసుకుంది. 2014, 2006లో చివరగా ఆడిన టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై విజయాలు నమోదు చేసిన భారత జట్టు.. తిరిగి అదే జట్టుపై టెస్టు క్రికెట్ వేటను పున ప్రారంభించబోతుంది. సీనియర్ బ్యాటర్, కెప్టెన్ మిథాలీరాజ్‌కు రెడ్ బాల్ క్రికెట్లో విశేషం అనుభవం ఉండగా.. జట్టులోకి చాలా మంది క్రికెటర్లకు టెస్టు ఫార్మాట్ అనుభవం లేదు. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధానలకు రెండే టెస్టుల అనుభవం ఉంది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ సహా ఇతర బ్యాటర్లపై ఫోకస్ కనిపిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ నేటి మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం కానుంది. పురుషుల క్రికెట్లో టెస్టు మ్యాచ్ ఐదు రోజులు ఆడితే.. మహిళల క్రికెట్లో నాలుగు రోజులే ఆడతారు.