Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపెక్స్ కౌన్సిల్‌పై అజార్ ఫైర్
నవతెలంగాణ, హైదరాబాద్ : అపెక్స్ కౌన్సిల్లో కొంత మంది సభ్యులు గ్యాంగ్‌గా ఏర్పడి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)ను హైజాక్ చేయాలని చూస్తున్నారని, షోకాజ్ నోటీసుతో తప్పుడు ఆరోపణలను ప్రచారం చేస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ' హెచ్‌సీఏ అధ్యక్షుడిగా సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ ఆరోపణలు అవాస్తవం. కె. జాన్ మనోజ్, ఆర్. విజయానంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, పి. అనురాధలు ఓ ముఠాగా ఏర్పడి తమకు తాము అపెక్స్ కౌన్సిల్ అనుకుంటున్నారు. ఈ ఐదుగురు అఫీస్ బేరర్లకు మల్టిపుల్ క్లబ్‌లు ఉన్నాయి. అందుకే అంబుడ్స్‌మన్ నియామకాన్ని అడ్డుకుంటున్నారు. అంబుడ్స్‌మన్ ఈ విషయంలో వీరిపై చర్య తీసుకుంటారనే భయంతోనే నియామకంపై వ్యతిరేకంగా ఉన్నారు. బీసీసీఐని తప్పుదోవ పట్టించి బోర్డు ఏజీఎంకు హాజరయ్యానని అంటున్నారు. రూల్స్ ప్రకారం తొమ్మిదేండ్లు బీసీసీఐ, రాష్ట్ర సంఘంలో ఉన్నవారు కొనసాగేందుకు వీల్లేదు. శివవాల్ యాదవ్ 18 ఏండ్లు పదవిలో ఉన్నారు. ఆయన ఎలా ప్రాతినిథ్యం వహిస్తారు?. హెచ్‌సీఏలో వేళ్లూనుకున్న అవినీతిని ప్రక్షాళన చేసేందుకు కృషి చేస్తున్నాను. అందుకు అందరి సహకారం అవసరం' అని అజహరుద్దీన్ తెలిపాడు.