Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్లూటీసీ ఫైనల్‌పై రోహిత్ శర్మ
సౌథాంప్టన్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాలను 'సులభంగా, వాస్తవికంగా' చూస్తుందని భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ' కివీస్ పేసర్లను వైట్‌బాల్‌తో ఆడాను. వారి బలం, బలహీనతలు తెలుసు. అతిగా ఆలోచన చేయకపోవటం ముఖ్యం. మ్యాచ్ ప్రక్రియను సులభంగా, వాస్తవికంగా ఉంచటం ప్రధానం. టెస్టుల్లో ఐదు రోజులు సవాళ్లను ఎదుర్కొవాలి. ప్రతి రోజు భిన్నమైన సవాల్ ఎదురవుతుంది. ఐదు రోజుల ఆటలో సహనం అవసరం. ప్రతి రోజు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మానసికంగా, సవాళ్లను ఎదుర్కొనేందుకు శారీరకంగా ఫిట్‌గా ఉండాలి' అని రోహిత్ శర్మ అన్నాడు. డబ్ల్యూటీసీ టోర్నీల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన రోహిత్ శర్మ ఫైనల్లో భారత్‌కు ఓపెనింగ్ చేయనున్నాడు.