Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు
- ఫాలో ఆన్ ఆడుతున్న భారత మహిళలు
బ్రిస్టోల్ : యువ బ్యాటర్, సంచలన ఓపెనర్ షెఫాలీ వర్మ (55 నాటౌట్, 68 బంతుల్లో 11 ఫోర్లు) చరిత్ర సృష్టించింది. టెస్టు అరంగేట్రంలోనే రెండు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసిన షెఫాలీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ దూకుడు కొనసాగించింది. ఓపెనర్లు అందించిన 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని మిథాలీసేన సద్వినియోగం చేసుకోలేదు. పూనమ్ (2), శిఖా (0), మిథాలీ (2), హర్మన్‌ప్రీత్ (4), తానియా (0), స్నేV్‌ా (2), పూజ (12), గోస్వామి (1) వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 81.2 ఓవర్లలోనే 231 పరుగులకు కుప్పకూలింది. 165 పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధించిన ఇంగ్లాండ్.. భారత్‌ను ఫాలోఆన్ ఆడించింది. ఫాలోఆన్‌లో ఓపెనర్ స్మృతీ మంధాన (8) నిరాశపరిచినా.. దీప్తి శర్మ (18 నాటౌట్, 66 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి షెఫాలీ వర్మ (55 నాటౌట్) పోరాడుతోంది. 24.3 ఓవర్లలో భారత్ 83/1తో కొనసాగుతోంది. వర్షం అంతరాయంతో పలుమార్లు ఆటను నిలిపివేశారు. భారత్ ప్రస్తుతం 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో కొనసాగుతోంది.