Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నేహ రానా అసమాన పోరాటం
- ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు డ్రా
బ్రిస్టోల్ : తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగుల వెనుకంజ. ఫాలోఆన్‌లో 199 పరుగులకే ఏడు వికెట్లు. భారత్‌కు ఓటమి ఖాయమనుకున్న దశలో అరంగేట్ర ఆల్‌రౌండర్ స్నేహ రానా (80 నాటౌట్, 154 బంతుల్లో 13 ఫోర్లు) అసమాన పోరాట స్ఫూర్తి చూపించింది. వికెట్ కీపర్ తానియా భాటియా (44 నాటౌట్, 88 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి అభేద్యమైన తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జోడించింది. తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చటమే కాదు 179 పరుగుల ముందంజలోకి భారత్‌ను తీసుకొచ్చింది. 121 ఓవర్లలో 344/8తో భారత్‌ను ఓటమి కోరల్లోంచి బయటపడేసింది. షెఫాలీ (63), దీప్తి (54), పూనమ్ (39) మెరిసినా.. మిథాలీ (4), హర్మన్ (8), పూజ (12) విఫలమయ్యారు. స్నేహ రానా అద్వితీయ ప్రదర్శనతో భారత్, ఇంగ్లాండ్ ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 386/9 డిక్లేర్డ్, భారత్ తొలి ఇన్నింగ్స్ : 231/10, భారత్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) : 344/8.