Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో అంత సులువు కాదు
- బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల
హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పి.వి సింధు టోక్యో ఒలింపిక్స్‌లో విపరీత ఒత్తిడి ఎదుర్కొనుందని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాల అభిప్రాయపడింది. ఐదేండ్ల కిందటి అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయటం సింధుకు అంత సులువు కాబోదని జ్వాల పేర్కొన్నది. ' టోక్యో ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. గత ఒలింపిక్స్ కంటే ఈసారి సింధుపై ఒత్తిడి ఎక్కువగా ఉండనుంది. రియోలో పరిస్థితులు పూర్తి భిన్నం. ఇప్పుడు పరిస్థితుల్లో మారిపోయాయి. అందరి అంచనాలు సింధుపైనే ఉన్నాయి. రియో విజయం అంత సులువుగా దక్కలేదు, టోక్యోలోనూ పతకం అలవోకగా రాబోదు. అందరికీ సింధు ఆట తెలుసు, అందరూ ఆమె ఆట చూశారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవటం భారత షట్లర్లకు ప్రతికూలం కానుంది. సాయిప్రణీత్ నైపుణ్యమున్న షట్లర్. అతడి ఆటపై సాయికి ఎన్నడూ విశ్వాసం లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్యంతో ఆత్మవిశ్వాసంలో మార్పు వచ్చింది. సాయి నిలకడలేమితో ఆడుతున్నా, మెరుగ్గా రాణిస్తాడనే అనుకుంటున్నాను. డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్‌లు జూనియర్లు. ఇంకా ఎంతో కెరీర్ ఉంది. టోక్యోలో వారు కోల్పోవడానికి ఏమీ లేదు. అందుకే, చావోరేవో తేల్చుకునేలా ఆడాలి. అండర్డాగ్ అనుకూలతను వాడుకోవాలి' అని జ్వాల తెలిపింది.