Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెఫాలీ వర్మపై మిథాలీ రాజ్
బ్రిస్టోల్ : అరంగేట్రం టెస్టులోనే వరుస అర్థ సెంచరీలు బాదిన యువ ఓపెనర్ షెఫాలీ వర్మ భవిష్యత్‌లో భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కీలకం కానుందని మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ వ్యాఖ్యానించింది. ఇంగ్లాండ్‌పై ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ధనాధన్ 96 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగిన షెఫాలీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్థ సెంచరీతో మెరిసింది. డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. ' షెఫాలీ వర్మ భారత బ్యాటింగ్ లైనప్‌కు మూడు ఫార్మాట్లలోనూ కీలకం కానుంది. టీ20 ఫార్మాట్లో వేటాడినట్టు రెడ్ బాల్‌పై షెఫాలీ దండయాత్ర చేయలేదు. కొత్త బంతిపై తెలివిగా బ్యాటింగ్ చేసింది. షెఫాలీ జోరు అలాగే కొనసాగితే భారత స్కోరు ఎక్కడికో వెళ్లిపోయేది. షెఫాలీ అమ్ములపొదిలో చాలా షాట్లు ఉన్నాయి. బ్రిస్టోల్‌లో పాత పిచ్‌పై ఆడుతున్నామని తెలిసి.. షెఫాలీ వర్మకు అరంగేట్ర అవకాశం కల్పించాం. రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీతో అనుభవంతో వచ్చేసింది. ఇక్కడి నుంచి షెఫాలీ వర్మ మరింత మెరుగైన బ్యాటర్‌గా ఎదుగుతుంది' అని మ్యాచ్ అనంతరం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మిథాలీరాజ్ తెలిపింది.