Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాశపరిచిన పంత్, కోహ్లి, రహానె
- కైల్ జెమీసన్ ఐదు వికెట్ల దూకుడు
- ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్
సౌథాంప్టన్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పట్టు బిగిస్తోంది!. తొలుత భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు కుప్పకూల్చిన కివీస్.. టాప్ ఆర్డర్ రాణించటంతో పరుగు వేటలోనూ దూకుడు చూపిస్తోంది. కైల్ జెమీసన్ (5/31) నిప్పులు చెరగగా 146/3తో మెరుగైన స్థితిలో ఉన్న భారత్ 71 పరుగులకే చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. అజింక్య రహానె (49, 117 బంతుల్లో 5 ఫోర్లు), విరాట్ కోహ్లి (44, 132 బంతుల్లో 1 ఫోర్)లు నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. రోహిత్ (34), గిల్ (28)కు సైతం తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 90/1తో కొనసాగుతోంది. ఓపెనర్ టామ్ లాథమ్ (30)ను అశ్విన్ అవుట్ చేయగా.. డెవన్ కాన్వే (46 నాటౌట్), విలియమ్సన్ (11 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.
71 పరుగులకే.. : 146/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. చివరి ఏడు వికెట్లను 71 పరుగులకే కోల్పోయింది. ఎంతో సహనం, నిగ్రహంతో కనిపించిన విరాట్ కోహ్లి (44, 132 బంతుల్లో 1 ఫోర్) ఓవర్‌నైట్ స్కోరుకే వెనుదిరిగాడు. జెమీసన్‌కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆదుకుంటాడనుకున్న రిషబ్ పంత్ (4, 22 బంతుల్లో 1 ఫోర్) ఓ బౌండరీతోనే సరిపెట్టుకున్నాడు. జెమీసన్ ఓవర్లోనే స్లిప్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. అజింక్య రహానె (49, 117 బంతుల్లో 5 ఫోర్లు), రవీంద్ర జడేజా (15, 53 బంతుల్లో 2 ఫోర్లు), అశ్విన్ (22, 27 బంతుల్లో 3 ఫోర్లు) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. ఇషాంత్ (4), బుమ్రా (0)లు తోకముడవగా.. మహ్మద్ షమి (4 నాటౌట్) అజేయంగా నిలిచాడు. 92.1 ఓవర్లలో భారత్ 217 పరుగులకు కుప్పకూలింది. కివీస్ పేసర్ కైల్ జెమీసన్ (5/31) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ట్రెంట్ బౌల్ట్ (2/47), నీల్ వాగర్ (2/40) ఆకట్టుకున్నారు.