Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకు రాణి రాంపాల్ నాయకత్వం వహించనుంది. ఈ మేరకు హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. ఎనిమిది మంది సీనియర్లు, ఎనిమిది మంది జూనియర్లతో కూడిన ఒలింపిక్ జట్టును ఇదివరకే ప్రకటించినా.. కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. రాణి రాంపాల్‌కు నాయకత్వ పగ్గాలు దక్కగా.. దీప్ గ్రేస్ ఎక్కా, సవితలు వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ' ఒలింపిక్స్‌లో భారత్‌కు సారథ్యం వహించటం గొప్ప గౌరవం. గత కొన్నేండ్లుగా జట్టులో సీనియర్లు బాధ్యతలు తీసుకోవటంతో కెప్టెన్సీ పాత్ర సులభతరమైంది' అని రాణి రాంపాల్ తెలిపింది.