Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి అథ్లెట్‌గా లారెల్ హబ్బర్డ్ ఘనత
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ చరిత్ర సృష్టించనుంది. ఒలింపిక్ క్రీడల్లో పోటీపడుతున్న తొలి ట్రాన్స్‌జెండర్ (లింగ మార్పిడి) అథ్లెట్‌గా లారెల్ నిలువనుంది. 43 ఏండ్ల లారెల్ టోక్యో ఒలింపిక్స్‌లో ఆగస్టు 2న జరిగే మహిళల సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో పోటీపడనుంది. 2012లో మహిళగా లింగమార్పిడి చేసుకున్న లారెల్... ఒలింపిక్స్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. యవ్వనంలో పురుషుడిగా పెరిగిన లారెల్.. మహిళల విభాగంలో అనుచిత లబ్ది పొందనుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించిన లారెల్, 2018 కామన్వెల్త్ క్రీడల్లో తీవ్ర గాయానికి గురైంది. ' గొప్ప అనుభూతి. నాకు మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ ప్రజలకు వినమ్రంగా కృతజ్ఞతలు. మూడేండ్ల కిందట కామన్వెల్త్ క్రీడల్లో చేతి విరిగింది. నా క్రీడా కెరీర్ ముగిసిందనే వైద్యులు చెప్పారు. మీ మద్దతు, సహకారం, ప్రేమతో చీకటిని చీల్చుకుంటూ వచ్చాను' అని లారెల్ భావోద్వేగంగా చెప్పింది.