Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్లో అభిమానులకు అనుమతి
టోక్యో : కరోనా మహమ్మారి బెడద పొంచి ఉన్నా, టోక్యో ఒలింపిక్ క్రీడలు అభిమానుల సమక్షంలోనే జరుగనున్నాయి. ఒలింపిక్ స్టేడియం సామర్థ్యంలో 50 శాతం సామర్థ్యంతో గరిష్టంగా పది వేల మందికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు టోక్యో క్రీడల నిర్వహణ కమిటీ సోమవారం వెల్లడించింది. విదేశీ అభిమానులను నిషేధిస్తూ మార్చి నెలలోనే నిర్ణయం తీసుకోగా.. పారాలింపిక్స్పై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ' ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ఒలింపిక్ క్రీడల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం, గరిష్టంగా పది వేల మందిని అనుమతిస్తాం. కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తే.. అభిమానుల ప్రవేశంపై నిషేధం విధించి, ఖాళీ స్టేడియాల్లోనే క్రీడలను నిర్వహిస్తాం' అని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.