Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో క్రీడల ఐఓఏ ప్రతినిధి బృందంలో చోటు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల నుంచి 2020 విశ్వ క్రీడలకు హాజరుకానున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రతినిధిగా జగన్మోహన్ రావు నిలువనున్నారు. జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రావుకు ఈ మేరకు ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా లేఖ పంపించారు. జులై 23-ఆగస్టు 8న జరిగే ఒలింపిక్స్‌కు భారత బృందంతో కలిసి జగన్ వెళ్లనున్నారు. 'ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావటం సంతోషం. జపాన్‌లో విశ్వ క్రీడల ఏర్పాట్లు, మౌళిక వసతులు, సౌకర్యాల కల్పనపై అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేస్తాను' అని జగన్ తెలిపారు.