Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త నిబంధనలపై క్రీడా మంత్రి రిజుజు
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోయే అథ్లెట్లపై ఒలింపిక్ నిర్వహణ కమిటీ కొత్త నిబంధనలు విధించటంపై భారత క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు నిరసన వ్యక్తం చేశారు. వివక్షపూరిత నిబంధనలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ' ఒలింపిక్ చార్టర్ ప్రకారం ఏ దేశంపై ఎటువంటి వివక్ష చూపకూడదు. అధికారిక ఫిర్యాదు చేయాలని ఐఓఏకు సూచించాం. భారత అథ్లెట్ల సన్నద్ధతకు ఆటంకం కలిగించే ఏ సమస్యనైనా గట్టిగా వ్యతిరేకిస్తాం' అని రిజుజు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైన భారత్ సహా 11 దేశాల అథ్లెట్లపై టోక్యో నిర్వాహకులు అదనపు నిబంధనలు మోపారు.