Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌పై గవాస్కర్
సౌథాంప్టన్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కచ్చితంగా విజేతను తేల్చేందుకు అనువైన విధానంతో ఐసీసీ ముందుకు రావాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్,న్యూజిలాండ్ పోటీపడుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు రోజులు వర్షంతో రద్దు కావటంతో.. ఫలితం తేలేందుకు అవకాశాలు సన్నగిల్లాయి.'ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ డ్రాగాముగిస్తే విజేతను తేల్చేందుకు కచ్చితంగా ఓ విధానం ఉండాలి. ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ విషయంపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఫుట్‌బాల్‌లో షూటౌట్, టెన్నిస్‌లో టైబ్రేకర్‌ను వాడుతున్నట్టే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఓ ఫార్ములా ఉండితీరాలి' అని గవాస్కర్ అన్నాడు.