Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ప్రభుత్వ సహకారంతో ప్రతి జిల్లాకు ఓ హ్యాండ్‌బాల్ అకాడమీని అందుబాటులోకి తెస్తామని జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్మోహన్ రావు పాల్గొన్నారు. '1970వ దశకంలో హ్యాండ్‌బాల్‌కు హైదరాబాద్ హబ్‌గా ఉండేది. కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులతో కలిసి పని చేసి పూర్వ వైభవం సాధించేందుకు కృషి చేస్తాను. అధునాతన సదుపాయాలతో నగరంలో ఓ హ్యాండ్‌బాల్ ఇండోర్ స్టేడియం, జిల్లాకో హ్యాండ్‌బాల్ అకాడమీ ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్నామని' జగన్మోహన్ రావు అన్నారు.