Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో ఒలింపిక్స్‌పై క్రీడల చీఫ్ హషిమోటో
టోక్యో : కరోనా మహమ్మారి నీడలో జరుగబోతున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడలు నిజమైన ఒలింపిక్ విలువలను ప్రతిబింబిస్తాయని టోక్యో 2020 చీఫ్ షీకో హషిమోటో అభిప్రాయపడ్డారు. ' నేను అథ్లెట్‌గా పోటీపడుతున్న కాలంలో.. టోక్యో క్రీడలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో నిజమైన ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల విలువలు చర్చకు వస్తాయని అనుకుంటున్నాను. ఒలింపిక్ క్రీడల పరమార్థం తెలియజేసేందుకు ఇదో చక్కని అవకాశం. క్రీడల ఫార్మాట్లో మార్పులు.. భవిష్యత్‌లో మరిన్ని నగరాలు ఆతిథ్యం ఇవ్వటానికి ప్రోత్సాహకంగా నిలువనున్నాయి' అని హషిమోటో అన్నారు. ఒలింపిక్స్‌లో పది వేల మంది అభిమానులకు అనుమతి ఇచ్చినా.. స్టేడియంలో కేరింతలు, ఆటోగ్రాఫ్‌లు, ఆలింగనాలకు అవకాశం లేదని నిర్వాహకులు కొత్త నిబంధనలు విధించారు.