Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపు వాకిట కివీస్
- భారత్ రెండో ఇన్నింగ్స్ 170/10
- న్యూజిలాండ్ లక్ష్యం 139, ప్రస్తుతం 100/2
నవతెలంగాణ-సౌథాంప్టన్
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపు వాకిట నిలిచింది. 139 పరుగుల ఊరించే లక్ష్యంతో బరిలోకి న్యూజిలాండ్ ఛేదనలో దూసుకుపోతుంది. 37 ఓవర్లలో ఆ జట్టు 100/2తో విజయం లాంఛనం చేసుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26, 61 బంతుల్లో 4 ఫోర్లు), రాస్ టేలర్ (34, 76 బంతుల్లో 5 ఫోర్లు) న్యూజిలాండ్ ఐసీసీ టైటిల్ తృష్ణను తీర్చేపనిలో నిమగమయ్యారు. అంతకముందు తొలుత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల వెనుకంజలో నిలిచిన భారత్.. న్యూజిలాండ్ ముందుత 139 పరుగుల సవాల్‌ను ఉంచింది. కివీస్ పేసర్లు టిమ్ సౌథి (4/48), ట్రెంట్ బౌల్ట్ (3/39), జెమీసన్ (2/30) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్ (9), డెవాన్ కాన్వే (19)లు తొలి వికెట్‌కు 33 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఓపెనర్లను ఇద్దరికీ సాగనంపాడు.
పంత్ ఒక్కడే.. : కీలక బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో అంచనాలను అందుకోలేదు. పుజారా, విరాట్, రహానెలు దారుణంగా నిరాశపరిచారు. తొలి సెషన్ ఆరంభంలోనే పుజారా (15, 80 బంతుల్లో 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (13, 29 బంతుల్లో) వికెట్లను కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. జెమీసన్ ఓవర్లో కోహ్లి వికెట్ల వెనకాల క్యాచౌట్ కాగా.. పుజారాను జెమీసన్ స్లిప్స్‌లో దొరకబుచ్చుకున్నాడు. 72/4తో ఉన్న భారత్‌ను ఆపద్బాందవుడు అజింక్య రహానె (15, 40 బంతుల్లో 1 ఫోర్) సైతం ఆదుకోలేదు. 109 పరుగులకే ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ దశలో రిషబ్ పంత్ (41, 88 బంతుల్లో 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (16, 49 బంతుల్లో 2 ఫోర్లు) జోడీపై భారం పడింది. లంచ్ విరామం అనంతరం రిషబ్ పంత్ ఎదురుదాడికి సిద్ధమయ్యాడు. సీమ్‌తో పంత్ మిస్‌ఫైర్‌కు తోడు కివీస్ పక్కా ఫీల్డింగ్‌ను మొహరించింది. దీంతో పంత్‌కు అంత సులువుగా పరుగులు రాలేదు. మరో ఎండ్‌లో జడేజా చేతులెత్తేయగా.. పంత్ ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. మిస్‌హిట్ షాట్‌తో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. టెయిలెండర్లలో మహ్మద్ షమి (13, 10 బంతుల్లో 3 ఫోర్లు) భారత్ స్కోరును కొంతమేర ముందుకు తీసుకెళ్లాడు. అశ్విన్ (7), బుమ్రా (0)లు నిరాశపరిచారు. 73 ఓవర్లలో 170 పరుగులకు భారత్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల లోటు తీసేస్తే.. న్యూజిలాండ్ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఐదు వికెట్లకు 61 పరుగులే చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ చివరి ఐదు వికెట్లకు 61 పరుగులే జోడించింది. చివరి ఐదుగురి భాగస్వామ్య లోపం భారత్‌ను మ్యాచ్‌కు దూరం చేసిందని చెప్పవచ్చు!.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 217/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 249/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ (ఎల్బీ) సౌథి 30, గిల్ (ఎల్బీ) సౌథి 8, పుజారా (సి) టేలర్ (బి) జెమీసన్ 15, కోహ్లి (సి) వాట్లింగ్ (బి) జెమీసన్ 13, రహానె (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 15, పంత్ (సి) నికోల్స్ (బి) బౌల్ట్ 41, జడేజా (సి) వాట్లింగ్ (బి) వాగర్ 16, అశ్విన్ (సి) టేలర్ (బి) బౌల్ట్ 7, షమి (సి) లాథమ్ (బి) సౌథి 13, ఇషాంత్ నాటౌట్ 1, బుమ్రా (సి) లాథమ్ (బి) సౌథి 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (73 ఓవర్లలో ఆలౌట్) 170.
వికెట్ల పతనం : 1-24, 2-51, 3-71, 4-72, 5-109, 6-142, 7-156, 8-156, 9-170, 10-170.
బౌలింగ్ : సౌథి 19-4-48-4, బౌల్ట్ 15-2-39-3, జెమీసన్ 24-10-30-2, వాగర్ 15-2-44-1.