Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్గత వార్మప్లతోనే సన్నాహాకం
సౌథాంప్టన్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆఖరు వరకు పోరాడిన భారత జట్టు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత క్రికెటర్లకు బీసీసీఐ 15 రోజుల సెలవులు ప్రకటించింది. ఫైనల్లో ఆడిన 15 మంది మినహా 22 మంది జట్టులోని ఇతర క్రికెటర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆరంభమైన అనంతరం సౌథాంప్టన్ వీడారు. లండన్ పరిసర ప్రాంతాల్లో క్రికెటర్లు ఆహ్లాదకరంగా గడపనున్నారు. అనంతరం డర్హమ్‌లో భారత జట్టు తిరిగి కలుసుకోనుంది. షెడ్యూల్ ప్రకారం భారత్ రెండు అంతర్గత వార్మప్ మ్యాచులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనుభవంతో టూర్ గేములు కోసం కోహ్లి గళమెత్తాడు. దీంతో కౌంటీ జట్టుతో టూర్ గేమ్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీబీని భారత బోర్డు కోరింది. బయో బబుల్‌లో కౌంటీ క్రికెటర్లను ఉంచటం సాధ్యం కాదని ఈసీబీ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. దీంతో భారత్ మళ్లీ అంతర్గత మ్యాచులతోనే సన్నాహాకం చేయనుంది.