Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నిబంధనలు, యాంటీ డోపింగ్‌పై అవగాహన
న్యూఢిల్లీ : భారత క్రీడా ప్రాధికారిక సంస్థ (సారు), భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించబోతున్న భారత అథ్లెట్లకు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. జులై 23న ఆరంభం కానున్న విశ్వ క్రీడల సందర్భంగా స్థానిక కోవిడ్ నిబంధనలు, యాంటీ డోపింగ్, జపాన్ సంస్కృతి సంప్రదాయాలపై సారు, ఐఓఏ అధికారులు అవగాహన కల్పించారు. ' లైఫ్ ఇన్ టోక్యో, ప్లేయింగ్ క్లీన్ అండ్ ఫ్రమ్ ఇండియా విత్ ప్రైడ్' పేరుతో క్రీడాకారులు, కోచ్‌లకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. పదేహేను రోజుల్లో టోక్యోకు బయల్దేరనున్న నేపథ్యంలో ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ వ్యాక్సినేషన్, యాంటీబాడీస్ నివేదిక సహా ఇతర అంశాలు అందులో వివరించారు. హాకీ, జూడో, రోయింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ అథ్లెట్లు, కోచ్‌లు తొలి సెషన్ తరగతులకు హాజరయ్యారు. స్టార్ షట్లర్ పి.వి సింధు, శరత్ కమల్, ఫెన్సర్ భవాని దేవి, అథ్లెట్ ఫవాద్ మీర్జాలు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) అధికారులు నిర్వహించిన 'ప్లేయింగ్ క్లీన్ మోడల్, యాంటీ డోపింగ్' సెషన్‌కు హాజరయ్యారు. ' ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అథ్లెట్లు భారత దేశ అంబాసిడర్లు. నిర్వహణ కమిటీ నిబంధనలను అర్థం చేసుకోవటం ప్రధానం. కోవిడ్ మహమ్మారితో క్రీడలు భిన్నమైన వాతావరణం జరుగుతున్నాయి. ఆ వాతావరణంలో సౌకర్యంగా, సురక్షితంగా ఉండటం అథ్లెట్ల బృందంలోని ప్రతి ఒక్కరి బాధ్యత' అని సారు డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్ తెలిపారు.