Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు
హైదరాబాద్ : 2016 రియో ఒలింపిక్స్‌తో పోల్చితే 2020 టోక్యో ఒలింపిక్స్ భిన్నమైనవి. టోక్యో క్రీడలు అంచనాలు భారీగా ఉంటాయి. అయినా, ఫోకస్‌ను మ్యాచ్‌లపైనే నిలిపి.. స్వర్ణంతో స్వదేశానికి తిరిగిరావటమే నా లక్ష్యమని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు తెలిపింది. ' మెగా టోర్నీల్లో నేను బరిలోకి దిగిన ప్రతిసారి పతకంతో తిరిగిరావాలనే అంచనాలు ఉంటాయి. ఈ స్థాయి అంచనాలతో అంత సులువు కాదు. కానీ నా దృష్టిని పూర్తిగా మ్యాచ్‌లపైనే కేంద్రీకరిస్తాను. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొన్నింటిని అధిగమించాలి. స్వర్ణంతో తిరిగి రావటమే నా అంతిమ లక్ష్యం' అని సింధు వ్యాఖ్యానించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల బృందం పతాకధారిగా నిలువటం గొప్ప గౌరమని సింధు పేర్కొంది. 'టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు పతాకధారిగా నిలువటం గొప్ప గౌరవం. అంత సులువుగా లభించే గౌరవం కాదు ఇది. నా కెరీర్లో అత్యంత గర్వపడే సన్నివేశం ఇదే కానుంది. ఈ గౌరవం దక్కటం పట్ల సంతోషంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్‌కు కఠోరంగా సిద్ధమవుతున్నాను. దక్షిణ కొరియా కోచ్ పార్క్ తే సంగ్‌తో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తున్నాను. ప్రతిరోజు భిన్న నైపుణ్యాలు కలిగిన షట్లర్లతో పోటీపడుతున్నాను. సింగిల్ వర్సెస్ డబుల్, సింగిల్ వర్సెస్ ట్రిపుల్ కాంబినేషన్లో సాధన చేస్తున్నాను' అని సింధు తెలిపింది.