Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే నేడు
బ్రిస్టోల్ : ఓటమి ఖాయమనుకున్న టెస్టు మ్యాచ్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా అమ్మాయిలు.. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక కాని షెఫాలీ వర్మ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌పై టెస్టులో 96, 63 పరుగులు చేసింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పరిమితులే లేకుండా విధ్వంసం సృష్టించే షెఫాలీ వర్మపై వన్డే సిరీస్‌లో ఫోకస్ కనిపిస్తోంది. కెప్టెన్ మిథాలీరాజ్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు పెద్దగా ఫామ్‌లో లేరు. ఈ ఇద్దరు రాణిస్తే భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారనుంది. స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన, షెపాలీ వర్మలు బ్యాటింగ్ బాధ్యతను తీసుకోనున్నారు. యువ స్పిన్ ఆల్‌రౌండర్, బ్రిస్టోల్ టెస్టు స్టార్ స్నేV్‌ా రానా నేడు వన్డే తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఏకైక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియటంతో వన్డే ఫార్మాట్లో ఆధిపత్యం కోసం భారత్, ఇంగ్లాండ్ తపిస్తున్నాయి. మధ్యాహ్నాం 3.30 గంటలకు వన్డే పోరు సోనీనెట్వర్క్లో ప్రసారం కానుంది.