Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్చరీ ప్రపంచకప్ 2021
పారిస్ : భారత ఆర్చరీ విలుకాడు అభిషేక్ వర్మ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్లో రెండు పసిడి పతకాలు సాధించిన తొలి భారత విలుకాడిగా నిలిచాడు. పారిస్లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్లో అభిషేక్ వర్మ కంపౌడ్ విభాగంలో వ్యక్తిగత పసిడి పతకం సాధించాడు. ఉత్కంఠగా సాగిన పసిడి పోరులో అమెరికన్ అథ్లెట్ క్రిస్ స్కాఫ్ను షూటౌట్లో ఓడించి గోల్డ్ మెడల్ సాధించాడు. షూటౌట్లో అభిషేక్ వర్మ పది సాధించగా.. అమెరికన్ తొమ్మిదే సాధించాడు. అంతకముందు ఫైనల్ రౌండ్లో అభిషేక్ వర్మ, క్రిస్ స్కాఫ్ 148-148తో సమవుజ్జీలుగా నిలిచారు. ఆరంభంలో అభిషేక్ వర్మ రెండు పాయింట్ల ముందంజలో నిలిచినా.. అమెరికన్ తర్వాతి లెవల్లో సమం చేశాడు. సెమీఫైనల్లో రష్యా ఆర్చర్ అంటోవ్ బులెవ్పై అభిషేక్ 146-138తో విజయం సాధించాడు.