Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్చరీ ప్రపంచకప్
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో ఆదివారం భారత మహిళల అగ్రశ్రేణి ఆర్చరీ బృందం సత్తా చాటింది. రెండు విభాగాల్లో టీమ్ విభాగం, మిక్సిడ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించారు. ముందుగా దీపిక కుమారి, అంకిత భతక్, కోమాలికలు- ఐదా రోమన్, అలెజాండ్ర వాలెన్సియా, అనా వజేకుజ్ మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. కాగా ఇది ప్రపంచకప్‌లో వీరికి వరుసగా రెండో విజయం. మిక్సిడ్ విభాగంలో భారత స్టార్ జంట అతను దాస్, దీపిక కుమారి పసిడి పతాకాన్ని గెలుచుకున్నారు. వీరు నెదర్లాండ్స్‌కు చెందిన జెఫ్ వాన్ డెన్ బర్గ్, గాబ్రిలా స్కాలెసర్ జంటపై 5-3 తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిస్ షాఫ్ (అమెరికా)తో అభిషేక్ వర్మ 'షఉట్ ఆఫ్'లో బంగారు పతకాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.