Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారిలపై విండీస్‌దే తొలి టీ20
సెయింట్ జార్జియా: సిక్సర్లతో విండీస్ బ్యాటమన్స్ విసుకు పడ్డారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 71 4×4, 7 ×6), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(24 బంతుల్లో 32× ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్(12 బంతుల్లో 23× 4, 3×6), ఆండ్రీ ఫ్లెచర్(19 బంతుల్లో 30, 3×4, 2×6) సిక్సర్లతో మోత మోగించడంతో విండీస్ 160 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అతిధ్య జట్టు సఫారీలను మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
విండీస్ టాస్ గెలిచి తొలుత ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వాన్ డర్ డుసెన్ (38 బంతుల్లో 56 పరుగులు), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డికాక్ (24 బంతుల్లో 37) రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. విండీస్ బౌలింగ్‌లో ఫాబియన్ అలెన్, బ్రావోలకుతలో రెండు వికెట్లు, హోల్డర్, రసెల్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కేవలం 15 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ బౌలర్ షంషికి ఓ వికెట్ దక్కగా, ఫ్లెచర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది. కాగా, సఫారీలతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 0-2తేడాతో కోల్పోయింది.