Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ
బుడాపెస్ట్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ప్రిక్యార్టర్లో భాగంగా ఆదివారం వెంబ్లీ స్టేడియంలో ఇటాలి ఆస్ట్రియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఇటలి విజయం సాధించింది. ఫెడెరికో చైసా 94వ , మాటెయి పెస్సినా 104 నిమిషాల్లో ఇటలి తరుపున గోల్స్ చేశారు. ఆస్ట్రియా నుండి ఇంజూరి టైమ్ 113వ నిమిషంలో సాసా సాలాజ్జిక్ గోల్ చేసి స్కోర్ అంతరాన్ని తగ్గించగలిగాడు కాని మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు. ఇటలి ఈ మ్యాచ్‌లో ఎక్కువ శాతం బాల్‌ను తమ ఆదినంలోను ఉంచుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆస్ట్రియా గోల్ పోర్టుపై దాడులు చేస్తు 94వ నిమిషంలో ఫెడెరికో గోల్‌తో ఖాత తెరిచింది. మరో పది నిమిషల్లో పెస్సినా మరో గోల్ చేయడంతో ఇటలి 2-0తో విజయం ముగింట నిలిచింది. చివరి ఇంజూరి సమయంలో ఆస్ట్రియా నుండి సాసా కాలాజ్జిక్ 113వ నిమిషంలో సాధించాడు.