Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: శ్రీలంకతో మూడు వన్డే, మరో మూడు టి20ల సిరీస్ ఆడేందుకు శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా జట్టు బయల్దేరింది. బిసిసిఐ ట్విటర్ వేదికగా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. టి20 ప్రపంచకప్ జరగనున్న దృష్ట్యా ఈ టూర్లో సత్తా చాటాలని యువ క్రికెటర్లు భావిస్తున్నారు. మెగా టోర్నీకి ముందు సిరీస్ గెలవడంపైనే దృష్టి సారించాలని కోచ్ ద్రవిడ్ తెలిపాడు.
భారతజట్టు: ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, గైక్వాడ్, సూర్యకుమార్, మనీష్, హార్దిక్, నితీష్ రాణా, ఇషన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), చాహల్, చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్, దీపక్ చాహర్, సైనీ, సకారియా.
వన్డే సిరీస్: జులై 13, 16, 18
టి20 సిరీస్: జులై 21, 23, 26